
సికింద్రాబాద్ : బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలు నిత్యం అనుసరించదగినవని, సామాజిక న్యాయం చేకూర్చిన ఘనత ఆయనకే దక్కిందని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తుకారం గేటు , మెట్టుగూడ, సితాఫలమండీ ప్రాంతాల్లో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పద్మారావు గౌడ్ పాల్గొని, ఘనంగా నివాళులర్పించారు. కార్పొరేటర్లు లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, రాసురి సునీత, కంది శైలజ లతో పాటు యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
