SAKSHITHA NEWS
Is the name of the speaker finalized?

స్పీకర్గా అయ్యన్న పేరు ఖరారు?

అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడి పేరు ఖరారైందా..?

ఖరారైనట్లు ఆయన స్వయంగా తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.

నర్సీపట్నం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయ్యన్న, ఐదుసార్లు మంత్రిగా పనిచేశారు.

అయితే ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో స్పీకర్ పదవి ఇస్తారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

అది నిజమేనంటూ ఆయనే ధ్రువీకరించారని అయ్యన్న సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.