రాజీవ్ గృహకల్ప కాలనీలో గంజాయి-డ్రగ్స్-మద్యం నిర్మూలనపై అవగాహన సదస్సు

Sakshitha news

రాజీవ్ గృహకల్ప కాలనీలో గంజాయి-డ్రగ్స్-మద్యం నిర్మూలనపై అవగాహన సదస్సు

*పాల్గొననున్న పోలీస్ అధికారులు-రాజకీయ నేతలు

*విజయవంతం చేయ్యాలని పిలుపునిచ్చిన సేవలాల్ సేన

  • ప్రజలంతా కదలి రావాలన్న సేవలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రనాయక్, మేడ్చల్ జిల్లా సేవలాల్ సేన అధ్యక్షుడు నాగరాజు నాయక్

సాక్షిత న్యూస్, నవంబర్ 16, కుత్బుల్లాపూర్:

నేడు సాయంకాలం 5 గంటలకు రాజీవ్ గృహకల్ప కాలనీలో మదర్ థెరిసా స్టాచ్యూ దగ్గర గంజాయి, డ్రగ్స్, మద్యంలాంటి మత్తు పానియాలకు అలవాటు పడ్డ యువతని సన్మార్గంలో నడిపించేందుకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని… సేవాలాల్ సేన తెలిపింది.
గంజాయి, డ్రగ్స్,మద్యం బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించేందుకు అవగాహన సదస్సు- సమావేశం జరుగుతుందని… సేవలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రనాయక్, మేడ్చల్ జిల్లా సేవలాల్ సేన అధ్యక్షుడు నాగరాజు నాయక్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశానికి పోలీస్ అధికారులు… IPS రామ్ రెడ్డి నాయక్, ఏసీపీ తేజావత్ రాందాస్ నాయక్, కూకట్పల్లి ACP సురేష్ రెడ్డి, బాచుపల్లి CI సతీష్, SI శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, 32వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి, సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు నాయక్, వివిధ పార్టీ నాయకులు,
అన్ని కుల సంఘాల నాయకులు,
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న స్వచ్చంద సేవకులు, మహిళా నాయకులు పాల్గొంటారని సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి సభావత్ రామచంద్ర నాయక్ చౌహన్ తెలిపారు.

వివిధ కాలనీల వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షులు, నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని…అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని
సేవాలాల్ సేన రామచంద్రనాయక్ పిలుపునిచ్చారు

Scroll to Top