నిజాంపేట్ ప్రభుత్వ పాఠశాలలో సమస్యలకు చెక్
*ఎడ్యుకేషన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళిన టేకుల ప్రవీణ్ రెడ్డి
*స్పందించిన టీపీసీసీ జనరల్ సెక్రటరీ జ్యోత్స్నా శివారెడ్డి
సాక్షిత న్యూస్, నిజాంపేట్
నిజాంపేట్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సరైన సదుపాయాలు లేక…నిత్యం విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గమనించిన నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టేకుల ప్రవీణ్ రెడ్డి తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో స్పందించిన తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ జ్యోత్స్నా శివారెడ్డి పాఠశాలను సందర్శించారు. అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు.
ఆకస్మిక తనిఖీ చేసిన జ్యోత్స్నా శివారెడ్డి పాఠశాల విద్యార్థులతో మాట్లాడడమే కాకుండా…ఉపాధ్యాయులతో సమస్యలపై చర్చించారు. పిల్లల చదువు, సౌకర్యాలు, మధ్యాహ్న భోజనాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టకుని…వారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని…సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని జ్యోత్స్నా శివారెడ్డి హామీ ఇచ్చారు.
నిజాంపేట్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యల గురించి చెప్పగానే…స్పందించి పరిష్కరించేందుకు వచ్చిన నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టేకుల ప్రవీణ్ రెడ్డి కి నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టేకుల ప్రవీణ్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జ్యోత్స్నా శివారెడ్డి పాఠశాల సమస్యలపై స్పందించినందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

