సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

Sakshitha news

సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు

సూర్యాపేట ): సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపల్ పెరుమాళ్ల యాదయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి భాను నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాన అతిథి భాను నాయక్, కళాశాల ప్రిన్సిపాల్ పెరుమాళ్ల యాదయ్య సమాచారం హక్కు చట్టం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఈ చట్టం ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకతను, జవాబుదారితనాన్ని పెంపొందిస్తుందని తెలిపారు. భారతదేశంలో ఏ పౌరుడైనా ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న రికార్డులు, పత్రాలు, నమూనాలు లేదా డేటా రూపంలో ఉండే సమాచారాన్ని అభ్యర్థించే హక్కు ఈ చట్టం ద్వారా కల్పించబడిందని వారు వివరించారు.ఈ అవగాహన సదస్సులో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.