బ్రైటర్ మైండ్స్ శిక్షణ పూర్తి చేసిన చిన్నారులకు మెడల్స్, ప్రశంసా పత్రాల ప్రదానం

Sakshitha news

బ్రైటర్ మైండ్స్ శిక్షణ పూర్తి చేసిన చిన్నారులకు మెడల్స్, ప్రశంసా పత్రాల ప్రదానం……

రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం…..

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
స్థానిక రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రైటర్ మైండ్స్ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న చిన్నారులకు మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేసే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖులు విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, విద్యార్థులలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో బ్రైటర్ మైండ్స్ వంటి శిక్షణా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. చిన్నారులు విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని కూడా సాధించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీ రమేష్ , డివిజన్ కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి , మాజీ కార్పొరేటర్ దాసరి ఉమాదేవి , పబ్లిక్ ప్రాసిక్యూటర్ , బ్రైటర్ మైండ్స్ శిక్షకులు వెంకటేష్ పాల్గొని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందజేశారు.

అలాగే రామచంద్ర మిషన్ బాధ్యులు ఆనంద్ , ట్రస్ట్ సభ్యులు, నాయకులు టి.ఆర్. రఘు క్రాంతి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులు, విద్యార్థులు నిర్వాహకులను అభినందించారు.
విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆహూతులను ఆకట్టుకుని ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

Scroll to Top