SAKSHITHA NEWS

ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు చొరవ చూపాలి

మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని

చిలకలూరిపేట : ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడంలో అధికారులు ప్రత్యేక చొరవచూపాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని
తెలిపారు.పురపాలక సంఘం లోని తన కార్యాలయంలో బుధవారం నాడు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, స్ధానిక ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారంపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్బంగా పలువురు పట్టణ ప్రజలు వివిధ సమస్యలపై అందించిన వినతులను ఆయన స్వీకరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి స్థానిక శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకుపట్టణ సంపూర్ణ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు, పట్టణ జనాభా కు తగ్గటుగా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

దీంట్లో భాగంగా మంచినీటి సరఫరా లో కొన్ని ప్రాంతాల్లో కొంత అసౌకర్యం కలిగిందని పుర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెల్లవారు ఝామున ప్రార్థన కు వెళ్ళు వారికి ఇబ్బందులు పడకుండా ఆయా ప్రాంతాల్లో వీధిలైట్లు ఏర్పాటు చేశామన్నారు,అదే విధముగా అన్ని వార్డుల పరిధిలోని విధి లైట్లకు మరమ్మతులుచేస్తున్నామున్నారు,అవసరమైన చోట విద్యుత్ స్ధంభాల ఏర్పాటుపై సంబంధిత డిఇ తో మాట్లాడటం జరిగిందని అన్నారు, వార్డుల పరిధిలో బోర్లు మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పారు,
చేతిపంపుల విషయంపై ఆయన స్పందిస్తూ పంపు ఎక్కడ వేయాలి తదితర వివరాలను ఇంజనీరింగ్ అధికారులకు,మున్సిపల్ కమిషనర్ కు అందజేస్తే పరిశీలించి పంపు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app