He is all set to leave you surprised

He is all set to leave you surprised with yet another impeccable performance. Introducing @ItsActorNaresh garu as ‘𝐕𝐞𝐞𝐫𝐚 𝐒𝐰𝐚𝐦𝐲’ from #𝔾𝕀ℕℕ𝔸🔥 GinnaBhai🔥 #GinnaOn21stOct💥 @iVishnuManchu @SunnyLeone @starlingpayal @avaentofficial @24FramesFactory @saregamasouth

శివకార్తికేయన్, థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన విజయ్ దేవరకొండ

శివకార్తికేయన్, అనుదీప్ కె.వి, ఎస్వీసి ఎల్ఎల్ పీ, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ ‘ప్రిన్స్’ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన విజయ్ దేవరకొండ వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు,…

జీ స్టూడియోస్ & డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో “ఆర్య 34” చిత్రం

ఆర్య కథానాయకుడిగా ముత్తయ్య దర్శకత్వంలో జీ స్టూడియోస్ & డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో “ఆర్య 34” చిత్రం  గ్రాండ్ గా ప్రారంభం అనేక బ్లాక్‌బస్టర్‌లు, విజయవంతమైన చిత్రాలను అందించిన జీ స్టూడియోస్ & డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థల సంయుక్త నిర్మాణంలో…

”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ న్యూ ఏజ్ కాన్సెప్ట్

”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ న్యూ ఏజ్ కాన్సెప్ట్.. చాలా ఫన్ వుంటుంది: ”బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ విశ్వంత్ దుడ్డుంపూడి, మాళవిక సతీషన్ ప్రధాన పాత్రలలో సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన  రోమ్-కామ్ ”బాయ్‌ఫ్రెండ్ ఫర్…

లక్ష్ చదలవాడ పుట్టినరోజు కానుకగా *ధీర* ఫస్ట్ లుక్ రిలీజ్ 

లక్ష్ చదలవాడ పుట్టినరోజు కానుకగా *ధీర* ఫస్ట్ లుక్ రిలీజ్  కెరీర్ ఆరంభం నుంచే వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ మంచి ఫామ్‌లో ఉన్నారు హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన.. ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల…

The #𝐆𝐢𝐧𝐧𝐚𝐓𝐫𝐚𝐢𝐥𝐞𝐫💥frenzy continues

The #𝐆𝐢𝐧𝐧𝐚𝐓𝐫𝐚𝐢𝐥𝐞𝐫💥frenzy continues. Trending on YouTube🔥 with 3⃣𝙼𝙸𝙻𝙻𝙸𝙾𝙽+Views💥 ICYMI▶️https://youtu.be/_ZQtidt8Xbg Ginna🔥 GinnaBhai🔥 GinnaOn21stOct💥 DynamicStar⭐️@iVishnuManchu @SunnyLeone @starlingpayal @avaentofficial @24FramesFactory @saregamasouth

త్రివిక్రమ్‌ను దర్శకునిగా  పరిచయం చేస్తూ… 

త్రివిక్రమ్‌ను దర్శకునిగా  పరిచయం చేస్తూ…  ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ‘నువ్వే నువ్వే’కు 20 ఏళ్ళు!– – – – – – – – – – – – – – – – – – – –…

బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ 

ఇంద్ర, ఠాగూర్‌ తర్వాత ఆ స్థాయిలో విజయం అందుకున్న చిత్రం గాడ్ ఫాదర్: బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌ లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటించిన ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్ లపై ఆర్‌ బి చౌదరి, ఎన్‌ వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌ గా నిర్మించారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..‘గాడ్‌ ఫాదర్‌’ కు ప్రపంచం నలుమూలల నుండి ట్రెమండస్  రెస్పాన్స్ వస్తోంది. నా జీవితంలో ఇంద్ర, ఠాగూర్‌ తర్వాత ఆ స్థాయి విజయం అంటుంటే ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో కంటెంట్‌ బాగుంటే సినిమాకి వస్తారని నేనే చెప్పాను.  గాడ్ ఫాదర్ తో నమ్మకం నిజమైంది. ప్రేక్షకులు చిత్రానికి బ్రహ్మరధం పడుతున్నారు. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మహిళలకు కూడా ఈ చిత్రం అమితంగా నచ్చడం ఒక శుభసూచికంగా భావిస్తున్నాను.  దర్శకుడు మోహన్ రాజా లూసిఫర్ లో లేని చాలా మ్యాజిక్స్ గాడ్ ఫాదర్ లో అద్భుతంగా చూపించారు. సత్యనంద్ గారు, మాటల రచయిత లక్ష్మీ భూపాల.. ఇలా అందరితో కలసి చక్కని టీం వర్క్ చేశాం. ఈ సినిమా కోసం చివరి నిమిషం వరకూ కష్టపడ్డాం. నా అనుభవంతో చెప్పే ప్రతి చిన్న మార్పుని దర్శకుడు మోహన్ రాజా అండ్ టీం ఎంతో గొప్పగా అర్ధం చేసుకొని  మరింత చక్కగా డిజైన్ చేశారు.  ఈ సినిమాలో పని చేసినందరూ నన్ను ప్రేమించిన వారే. నేను స్క్రీన్ పై ఎలా ఉండాలో నాకంటే వాళ్ళకే బాగా తెలుసు. వాళ్ళు చెప్పినట్లే చేశాను. అందుకే ఇంత గొప్ప ఆదరణ లభించింది. గాడ్ ఫాదర్ లో నేను కళ్ళతోనే నటించానని ప్రశంసలు వస్తున్నాయంటే .. ఈ క్రెడిట్ అంతా  సినిమాలో పని చేసినందరికీ వెళుతుంది. ఈ సినిమా గొప్ప విజయం ఇవ్వాలని పనిచేశాం. ఆ విజయం వరిచింది. ఈ సినిమా కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. జీవితంలో అన్నీ డబ్బుతోనే ముడిపడివుండవు.  సల్మాన్‌ఖాన్‌ మాపై ప్రేమ, ఆప్యాయతతో ఈ సినిమా చేశారు. పారితోషికాన్ని కూడా తిరస్కరించారు. అయితే చరణ్ బాబు సల్మాన్ భాయ్ కి తగిన కానుక ఏర్పాటు చేస్తారు. తమన్ సంగీతం ఈ చిత్రానికి ఆరో ప్రాణం. నజభజజజరా పాట ఆలోచన తమన్ దే. అలాగే ఈ సినిమాకి టైటిల్ ఇచ్చింది కూడా తమనే.  సత్యదేవ్ అద్భుతమైన ఫెర్ ఫార్మ్మెన్స్  చేశారు. గాడ్ ఫాదర్ కు మరో పిల్లర్ గా నిలిచారు. నయనతార తన నటనతో ఎంతో హుందాతనాన్ని తీసుకొచ్చారు. మురళి శర్మ అద్భుతంగా చేశారు. మురళి మోహన్ గారు నాతో పాటు ప్రయయానించే పాత్ర చేశారు. బెనర్జీ చాలా హుందాగా వుండే పాత్ర చేశారు. పూరి జగన్నాథ్ మాపై వున్న ప్రేమతో ఈ సినిమాలో ఒక చక్కని పాత్రలో  కనిపించారు. సునీల్, షఫీ ఇలా అందరూ చక్కని అభినయం కనబరిచారు. అలాగే ప్రభుదేవా కొరియోగ్రఫీని చాలా ఎంజాయ్ చేశాను. ఎక్కడా తప్పుపట్టలేని సినిమా ఇది. నిరవ్ షా అద్భుతమైన కెమరా వర్క్ ఇచ్చారు. చివర్లో వచ్చిన పాటలో చోటా కే నాయడు తన ప్రతిభని చూపించారు. సురేష్ మంచి ఆర్ట్ వర్క్ ఇచ్చారు.  సినిమా విడుదలై  బావుందనే టాక్ వచ్చిన తర్వాత ప్రతి మీడియా హౌస్ చిత్రాన్ని చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేశాయి. మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. పవర్ ఫుల్ కంటెంట్ వున్న చిత్రం గాడ్ ఫాదర్. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తోంది. నా జీవితంలో అత్యద్భుతమైన చిత్రాలు పదిహేను వుంటే అందులో గాడ్ ఫాదర్ ఒకటి. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు” తెలిపారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ .. గాడ్ ఫాదర్ కోసం టీం అంత చాలా హార్డ్ వర్క్ చేశాం. ఈ సినిమాకి మూలకారణం చరణ్ బాబు. చరణ్ బాబు లేకపొతే సల్మాన్ ఖాన్ ఇంటి గేటు దగ్గరికి కూడ వెళ్ళలేం. చరణ్ బాబు మాకు ఇంతగొప్ప అవకాశం ఇచ్చారు. దాన్ని మేము నిలబెట్టుకున్నాం. గాడ్ ఫాదర్ సెన్సేషనల్ హిట్. థియేటర్ లో యనభై శాతం మహిళా ప్రేక్షకులు వుండటం అంటే మాములు విజయం కాదు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. చరణ్ బాబుతో కలసి భవిష్యత్ లో మరిన్ని చిత్రాలు చేస్తాం” అని తెలిపారు. దర్శకుడు మోహన్ రాజా మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ కు ఘన విజయం అందించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. అనంతపురంలో వర్షం కారణంగా ఈవెంట్ కి అంతరాయం కలిగితే మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే మొత్తం భాత్యతని భూజలపై ఎత్తుకొని ఈవెంట్ సక్సెస్ చేశారు. అలాగే గాడ్ ఫాదర్ ని కూడా సారధిలా ఉంటూ ముందుకు తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా చిరంజీవి గారికికి కృతజ్ఞతలు. ఎడిటర్ మోహన్ గారి అబ్బాయిలు గా మాకు ఎంతో గౌరవం వుంది. ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత ఆయన్ని మళ్ళీ ఈ వేడుకకి తీసుకురావడం చాలా ఆనందంగా వుంది. గాడ్ ఫాదర్ ప్రతి సన్నీవేశంలో చిరంజీవి గారి ఇన్ పుట్స్ వున్నాయి. ఆయన అనుభవాన్ని వాడుకున్నాం కాబట్టే ఈ రోజు సినిమా ఇంత గొప్ప విజయం సాధించింది. ఎన్వీ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు” తెలిపారు.  సత్యదేవ్ మాట్లాడుతూ.. చిరంజీవి అన్నయ్య స్క్రీన్ పై ఎంత మెగాస్టారో బయట దిని కంటే పది రెట్లు మెగాస్టార్. అన్నయ్య కెరీర్ లో  బ్లాక్ బస్టర్స్ వున్నాయి. గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ లో నేను భాగం కావడం చాలా ఆనందంగా వుంది. నన్ను నమ్మి ఇంత పాత్ర పాత్ర ఇచ్చిన అన్నయ్యకి జీవితాంతం రుణపడి వుంటాను. అన్నయ్య పేరు నిలబెట్టే సినిమాలు చేస్తాను. దర్శకుడు మోహన్ రాజా, నిర్మాత ఎన్వి ప్రసాద్ .. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు” తెలిపారు. మెహర్‌ రమేష్‌ మాట్లాడుతూ.. చిరంజీవి గారు రియల్లీ గాడ్ ఫాదర్. ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు. సత్యదేవ్ కి అద్భుతమైన పాత్ర ఇచ్చి తనతో గొప్ప నటుడిని సరికొత్తగా ఆవిష్కరించారు. చిరంజీవి గారు సినిమా కోసం అహర్నిషలు అలసట లేకుండా పని చేస్తారు. మోహన్ రాజా  మెగా అభిమానులు కోరుకునే విజయాన్ని అందించారు. అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా చూసి బావుందని అంటున్నారు. గాడ్ ఫాదర్ టీంకి కృతజ్ఞతలు” తెలిపారు. బాబీ మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన చిత్ర యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు. దర్శకుడు మోహన్ రాజా చిత్రాన్ని అద్భుతంగా తీశారు. మోహన్ రాజా ఈ చిత్రాన్ని అద్భుతంగా బిగించారు. అన్నయ్య కనుసైగల్లో గొప్ప యాక్షన్ ని డిజైన్ చేశారు. ఈ సినిమాని పని చేసినందరికీ థాంక్స్ ” చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్‌ మోహన్‌, మురళీమోహన్‌, సర్వదమన్‌ బెఖర్జీ, కె.ఎస్‌.రామారావు సత్యానంద్‌, డి.వి.వి.దానయ్య, ఛోటా కె.నాయుడు, లక్ష్మీభూపాల్‌, మురళీశర్మ, సునీల్‌, దివి, వారినా హుస్సేన్, విక్రమ్‌, కస్తూరి, వాకాడ అప్పారావు, రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, మనోజ్ పరహంస, మార్తాండ్ కె వెంకటేష్, పవన్‌తేజ్‌, విఎఫ్ కేస్ యుగంధర్, సురేష్ సెల్వరాజన్, స్టంట్ సిల్వ తదితరులు పాల్గొన్నారు.

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE