SAKSHITHA NEWS

Atharva‘ has come out amazingly.. Subhash Nutalapati is the producer

‘అథర్వ’ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చింది.. నిర్మాత సుభాష్ నూతలపాటి

పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో  తెరకెక్కుతున్న కొత్త సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో రాబోతున్న ఈ చిత్రానికి విజయ, ఝాన్సీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఎంతో గ్రాండ్‌గా రూపొందుతున్న ఈ సినిమా యూనిట్ తాజాగా మీడియా ముందుకు వచ్చారు. సినిమా షూటింగ్ పూర్తయిందని ప్రకటిస్తూ చిత్రయూనిట్ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సుభాష్ నూతలపాటి మాట్లాడుతూ.. ‘అథర్వ నాకు ఓ ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. ఈ చిత్రం ఎంతో అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది’ అని అన్నారు.

డైరెక్టర్ మహేష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించారు. డీజే టిల్లు ఫేమ్ శ్రీచరణ్ పాకాల మంచి సంగీతాన్ని అందించారు. కెమెరామెన్ చరణ్‌ మాధవనేని అద్భుతంగా చూపించారు. అథర్వ అనేది యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్‌లా ఈ సినిమా ఉండదు. ఎంతో ఇంటెన్సిటీ ఉంటుంది. ఆడియెన్స్ కచ్చితంగా థ్రిల్ అవుతారు. మూడు పాటలు అద్భుతంగా ఉంటాయి. శ్రీచరణ్ పాకాల ఇచ్చిన సాంగ్స్, ఆర్ఆర్ అన్నీ కూడా అద్భుతంగా ఇచ్చారు’ అని అన్నారు.

నిర్మాత తండ్రి శ్రీనివాస్ నూతలపాటి మాట్లాడుతూ.. ‘పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ మీద నా కొడుకు సుభాష్‌ను నిర్మాతగా పరిచయం చేస్తున్నాను. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించాం. సినిమాకు ఏం కావాలో అన్నీ చేశాం. సినిమాకు సపోర్ట్ చేస్తున్న మీడియాకు థాంక్స్’ అని అన్నారు.

కెమెరామెన్ మాట్లాడుతూ.. ‘సుభాష్‌ మాకు నిర్మాతగా కంటే ఓ స్నేహితుడిలా ఉండేవారు. మా హీరో కార్తీక్ రాజు కూడా సెట్‌లో ఎంతో సరదాగా ఉండేవారు. సిమ్రన్ డెడికేషన్ వేరే లెవెల్లో ఉండేది. ఆర్ట్ డైరెక్టర్ రామ్ గారి వల్లే విజువల్స్ అంత బాగా వచ్చాయి. మా డైరెక్టర్ ఎంతో పాజిటివ్ వ్యక్తి. నన్ను బాగా సపోర్ట్ చేశారు. సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ.. ‘కౌసల్యా కృష్ణమూర్తి తరువాత అథర్వ చేశాను. మంచి సినిమా చేద్దామని అనుకుంటున్న సమయంలోనే అథర్వ కథ విన్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ క్లూస్ డిపార్ట్మెంట్ మీద సినిమాలు రాలేదు. మా నిర్మాత సినిమాకు ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టారు. హీరోయిన్ సిమ్రన్‌తో పని చేయడం సరదాగా ఉంది. ఐరా చాలా కష్టపడే వ్యక్తి. ఈ టీం అంతా కూడా ఫ్యామిలీలా కలిసిపోయాం. శ్రీనివాస్‌ గారు తన అబ్బాయిని మంచి నిర్మాతగా నిలబెట్టాలని ఆశిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల సంగీతమంటే నాకు ఇష్టం. ఈసినిమాకు మంచి సంగీతాన్ని అందించారు’ అని అన్నారు.

హీరోయిన్ సిమ్రాన్ చౌదరి మాట్లాడుతూ.. ‘నేను ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పాను. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నాం. సుభాష్‌ గారికి నిర్మాతగా ఇది మొదటి చిత్రం. ఈ టీంతో కలిసి పని చేయడం నాకు ఆనందంగా ఉంది. మా డీవోపీ చరణ్‌ ఎంతో చక్కగా చూపించారు. మా డైరెక్టర్ మహేష్‌ సినిమా అద్భుతంగా రూపొందించారు. కథ విన్న వింటనే ఓకే చెప్పాను. కార్తీక్ రాజు హీరోగా కంటే నాకు మంచి మిత్రుడిగా మారారు. మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి’ అని అన్నారు.

సాంకేతిక బృందం

రైటర్, డైరెక్టర్: మహేష్ రెడ్డి

ప్రొడ్యూసర్: సుభాష్ నూతలపాటి

బ్యానర్: పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ 

సమర్పణ: నూతలపాటి నరసింహం, అనసూయమ్మ

మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల

DOP: చరణ్ మాధవనేని 

ఎడిటింగ్: SB ఉద్ధవ్ 

ఆర్ట్: రామ్ కుమార్

లిరిక్స్: కాసర్ల శ్యామ్, కిట్టు విస్సప్రగడ 

PRO: సాయి సతీష్, పర్వతనేని


SAKSHITHA NEWS