మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి చొరవతో ‘స్పెషల్ గ్రేడ్’గా
చిలకలూరిపేట మున్సిపాలిటీ
కమిషనర్ శ్రీహరి బాబు
ప్రత్తిపాటి కృషితోనే సాధ్యం
చిలకలూరిపేట మున్సిపాలిటీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తీసుకున్న ప్రత్యేక చొరవ వల్లే కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయిందని పట్టణ అభివృద్ధిపై ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొంటూ మాజీ మంత్రి శాసనసభ్యులు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పెరగనున్న ఉద్యోగ అవకాశాలు మెరుగైన సేవలు
మున్సిపాలిటీ హోదా పెరగడం వల్ల పట్టణానికి చేకూరే ప్రయోజనాలను కమిషనర్ తెలిపారు స్పెషల్ గ్రేడ్ హోదాతో పట్టణ మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని నిధులుమంజూరవుతాయి.మున్సిపాలిటీలో సిబ్బంది సంఖ్య పెరగనుంది, తద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.అదనపు సిబ్బంది అందుబాటులోకి రావడం వల్ల ప్రజలకు మున్సిపల్ సేవలు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయని ఆయన వెల్లడించారు.అభివృద్ధి పథంలో పట్టణంఈ మార్పుతో చిలకలూరిపేట పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, పారిశుధ్యం, డ్రైనేజీ మరియు తాగునీటి సరఫరా వంటి అంశాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని కమిషనర్ పి శ్రీహరి బాబు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
