రైల్వే కోడూరు నియోజకవర్గం:–
కడప టూ రేణిగుంట నేషనల్ హైవే NH-716 పనులకు శుభారంభం
కడప టు రేణిగుంట నేషనల్ హైవే పనులను కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన ఇంచార్జ్ & kuda చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ .
రేణిగుంట–కడప నేషనల్ హైవేకు ఊతం: కేంద్ర అనుమతులతో అభివృధి సాధ్యం..ముక్కా రూపానంద రెడ్డి
పుల్లంపేట నుంచి నేషనల్ హైవే విస్తరణకు నాంది – ముక్కా రూపానంద రెడ్డి మరియు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆధ్వర్యంలో అభివృద్ధికి కొత్త దిశ
పుల్లంపేట మండలం నుండి నేషనల్ హైవే NH-716 అభివృద్ధి పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పనులను రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి , ప్రభుత్వ విప్ మరియు రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ తో కలిసి ప్రారంభించారు.
గత ఐదేళ్లుగా నత్తనడకన సాగుతున్న కడప–రేణిగుంట నేషనల్ హైవే నిర్మాణంపై ముక్కా రూపానంద రెడ్డి , సాయి లోకేష్ కేంద్ర మంత్రి గడ్కరీ ని ఢిల్లీ లొ మర్యాదపూర్వకంగా కలిసి, విషయం వివరించడంతో ,దీనిపై వెంటనే స్పందించిన కేద్ర మంత్రి గడ్కరీ రూ. 90 కోట్ల నిధులను తక్షణమే మంజూరు చేశారు..ఈ నేపథ్యంలో హైవే పనులు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ — నేషనల్ హైవే విస్తరణ, అభివృద్ధి వల్ల రైల్వేకోడూరు, రాజంపేట మార్గాల్లో రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడతాయని తెలిపారు. ఈ రహదారి పూర్తవడం ద్వారా స్థానికుల ప్రయాణం సులభం అవుతుంది అని పేర్కొన్నారు.
కేంద్రంలో పునరేంద్రీకరణకు కృషి చేసి బిల్లులు శాంక్షన్ చేయించడంలో కీలకపాత్ర పోషించిన కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ కి, బీజేపీ జాతీయ నాయకురాలు పురందేశ్వరి కి అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.

అరవ శ్రీధర్ మాట్లాడుతూ , హైవే అభివృధి కోడూరు అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. కూటమి సాఫల్యానికి..ప్రజల అభివృద్ధి కోసం కూటమినేతల కట్టుబాటుకి ఇది నిదర్శనం..అని అన్నారు.
ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ మరియు పురందేశ్వరి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి సంబరాలు జరిపారు. ఈ కార్యక్రమంలో, స్థానిక ప్రజాప్రతినిధులు, NDA కూటమి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకులు ప్రజలకు మరింత అభివృద్ధి పనులను అందించే దిశగా కృషి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
