ఎచ్చెర్లలో దేహదారుఢ్య పరీక్షలకు ముమ్మరం ఏర్పాట్లు
శ్రీకాకుళం : ఎచ్చెర్ల ఆర్మ్డ్ పోలీస్ రిజర్వ్ పరేడ్ మైదానాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు PMT, PET పరీక్షలు జరగనున్న నేపథ్యం లో అభ్యర్థులు ప్రవేశం,వెళ్లే మార్గాలను ఎస్పీ పరిశీలించి, ధ్రువీకరణ పత్రాలు పరిశీలన కు అవసరమైన కౌంటర్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు.