Arekapudi Gandhi was the government whip who anointed the Lord
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీ శివాలయం దేవాలయంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగా రావు తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి పరమేశ్వరునికి అభిషేకం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం అతి పవిత్ర దినం.ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా పరమ శివుడికి అత్యంత ఇష్టమైన రోజు , శివరాత్రి నాడు వాడ వాడల రోజు వారీ ఉపవాస దీక్షల తో , జాగారం తో వేడుక చేసుకుంటారు. ఆ పరమ శివుడిని ఆరాధిస్తూ పర్వశించే పవిత్ర రోజు మహా శివరాత్రి రోజు అని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
అదేవిధంగా శివుడు మహా తపస్వి, లోక క్షేమం కోసం చేసే తపస్సు అది, ఏ మంచి పని అయిన దీక్ష తో ఓ తపస్సులా ఆచరించాలని దేనికి చలించరాదు అని, ఈ విశిష్టతనే శివతత్వం బోధిస్తుంది అని, శివ శబ్దం మంగళాత్మకం అని , అందుకే శివుడు అనే పేరు ఎన్నో శుభాలను సూచిస్తుంది. శుభాలన్నీ గుణాలే ,అనేక గుణాలకు నిలయుడైన వాడు శివుడు ,ఆయనను లోకమంతా ఆరాదిస్తుంది అని, శివ నామాన్ని జపిస్తుంది ,ఆయన దర్శనం కోసం తపిస్తుంది అని, ఇదే శివతత్వం అని మహా శివరాత్రి పర్వదిన ప్రత్యేకం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు , వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, పాపిరెడ్డి నగర్ కాలనీ అధ్యక్షులు చంద్రారెడ్డి బీఆర్ ఎస్ పార్టీ నాయకులు భగవంత్ రెడ్డి, ధర్మారావు, రామిరెడ్డి, నర్సిములు, అనంత రాములు,ముత్యం రెడ్డి,పాండు గౌడ్, లక్ష్మీ, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.