SAKSHITHA NEWS

కేటీఆర్ అరెస్టు కు రెడీ అవుతున్నారా ?

అరెస్టు కావడానికి రెడీ కానీ పోలీసు అధికారులకు మిత్తితో సహా చెల్లిస్తామని ఆదిలాబాద్‌లో కేటీఆర్ ప్రకటించారు. కేటీఆర్ నోట అరెస్ట్ అనే మాట రావడం కాస్త సంచలనమే. ఎందుకంటే ఒకటి , రెండు రోజుల్లో బాంబులు పేలుస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సియోల్ నుంచి హడావుడిగా ప్రకటించారు. అన్ని ఫైళ్లు రెడీ అయ్యాయని కక్ష సాధింపులు అనే దానికి అవకాశం లేకుండా తాము చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

ఈ అంశంపై కేటీఆర్‌కు కూడా ఏదో సమాచారం ఉందని అందుకే అరెస్టుల గురించి మాట్లాడుతున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి ఈ అంశంలో ఇప్పటికే ఆలస్యమయిందన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. రేవంత్ రెడ్డిని పదేళ్ల పాటు పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయినా ఆయన చాలా కాలం పాటు బిగపట్టుకుని ఉన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోకపోతే చేతకాని అనుకుంటారని… అందుకే తగ్గకూడదని డిసైడవుతున్నారని అంటున్నారు.

అయితే అర్థరాత్రి.. అపరాత్రి అనే తేడా చూపకుండా కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశాలు ఉండవని నోటీసులు ఇచ్చి, ఆధారాలను ప్రజల్లో పెట్టి అరెస్టు కరెక్టే అన్న భావన వచ్చేలా చేసి అరెస్టు చేస్తారని అంటున్నారు. మొత్తంగా కేటీఆర్ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నారని అనుకోవచ్చు.. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాక్ష్యాలు సేకరించిందన్నదే ఇప్పుడు కీలకం.


SAKSHITHA NEWS