SAKSHITHA NEWS

బిసి, జనరల్, ఎస్సి, ఎస్టీ,గురుకులాల్లో 5 నుండి 9 వ తరగతి వరకు ప్రవేశాల ధరఖాస్తులు.

ఆన్ లైన్ లో పిబ్రవరి 1 చివరి తేది.

పిబ్రవరి 23న ప్రవేశ పరీక్ష.

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 5తరగతి నండి 9వ తరగతి ప్రవేశాల కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ తేజస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎక్కువగా ఈ పరీక్ష రాసేవిధంగా చూడాలని ఉపాధ్యాయులకి సూచించారు. గురుకుల పాఠశాలలో నాణ్యమైన బోధన పద్ధతుల ద్వారా భోదించటం జరుగుతుంది. కాబట్టి ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ క్రింద చూపిన విధంగా గురుకులాల్లో 5తరగతి నండి 9వ తరగతి వరకు కామన్ ఎన్ట్రస్స్ టెస్ట్ ఉంటుదని తెలిపారు.
1)ఎస్సి, ఎ స్టి,బి సి అలాగే జనరల్ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కొరకు .
2)ఎస్సి, ఎస్టీ గురుకులాల్లో 6 వ తరగతి నుండి 9 వ తరగతి వరకు ప్రవేశాల కొరకు.
3)TGWRIES రుక్మాపూర్,సైనిక్ పాఠశాల తో పాటు మల్కాజ్ గిరి పైన్ ఆర్ట్స్ స్కూల్ లో 6 వ తరగతి ప్రవేశాల కొరకు.
4) TGWRIES ఖమ్మం,
పరిగి SOE లలో 8 వ తరగతి ప్రవేశాల కొరకు
5)TGWRIES గౌలిదొడ్డి, అలుగునూరు COE లలో 9వ తరగతి ప్రవేశాల కొరకు.
పిబ్రవరి 23 నాడు నిర్వహించే పరీక్ష కొరకు దరఖాస్తులు ఆహానించనైనదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఈ దరఖాస్తులు పిబ్రవరి 1వ తేదీ వరకు http:// tgcet.cgg.gov.in ద్వారా ఆన్ లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.

ఇట్టి దరఖాస్తు సమర్పించుటకు

1)కులం సర్టిఫికెట్ నెంబర్
2)ఆదాయం సర్టిపికెట్ నెంబర్
3)ఆధార్ కార్డు నెంబర్
4) బర్త్ సర్టిఫికెట్
5) పాస్ ఫొటో ను ఆన్ లైన్ లో దరఖాస్తు నింపేందుకు అవసరం ఉంటాయాన్ని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.


SAKSHITHA NEWS