
ప్రభుత్వ సబ్సిడీతో సొంతంగా ఇల్లు నిర్మించుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానం
కమిషనర్ ఎన్.మౌర్య*
సాక్షిత : తిరుపతి నగరంలో సొంత స్థలం కలిగి ఉండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద ప్రభుత్వ సబ్సిడీ ద్వారా సొంతంగా ఇల్లు నిర్మించుకోవడానికి తిరుపతి నగరంలో అర్హులైన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి నగరపాలక కమిషనర్ ఎన్.మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి నగరంలో సొంత స్థలం కలిగి ఉండి PMAY 2.0 పథకం కింద ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా 2 లక్షల 50 వేల ప్రభుత్వ సబ్సిడీ ద్వారా సొంతంగా ఇల్లు నిర్మించుకోవడానికి ఆసక్తి ఉన్న లబ్ధిదారులు మీ దగ్గరలో ఉన్న సంబంధిత వార్డు సచివాలయం లో అమెనిటి సెక్రెటరిని కలసి, లబ్ధిదారుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, పాన్ కార్డు, కులం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్, ల్యాండ్ డాక్యుమెంట్స్, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ తదితర పత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.
