
ఏపి రాజ్యసభ ఎంపీ స్థానం ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల
విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ.. 22న నోటిఫికేషన్, మే 9న పోలింగ్
ఏపీలో ఖాళీగా ఉన్న ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది.
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 30న నామినేషన్ల పరిశీ లన ఉంటుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 9న ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. 13వ తేదీలోపు ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది.
