SAKSHITHA NEWS

ఏపీ హోం మంత్రి అనిత పీఏ పై వేటు

అవినీతి ఆరోపణల నేపథ్యంలో జగదీష్‌ను ఆ పోస్టు నుంచి తొలగింపు

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత వద్ద పీఏగా పనిచేస్తున్న సంధు జగదీష్‌పై వేటు

బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు

అంతేకాకుండా సెటిల్‌మెంట్ దందాలు కూడా చేస్తున్నారని కూడా పలువురు ఆరోపణ.. పాయకరావుపేట నియోజకర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అనితను కలవడానికి వెళ్లిన సమయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది

ఈ క్రమంలోనే మంత్రి అనిత తర్వాత తానే అన్నట్టుగా జగదీష్‌ వైఖరిపై టీడీపీ క్యాడర్ సైతం తీవ్ర ఆగ్రహం

అయితే జగదీష్‌పై ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పటికీ హోం మంత్రి అనిత మాత్రం వాటిని పట్టించుకోలేదు. దీంతో అనిత అండతోనే జగదీష్ ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నాడు అంటూ తెరమీదకు వచ్చిన ప్రచారం

అయినప్పటికీ హోం మంత్రి అనిత వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో జగదీష్ వ్యవహారంపై ప్రభుత్వానికి, టీడీపీ అధిష్టానానికి అందిన ఫిర్యాదులు

దీంతో జగదీష్‌ను హోం మంత్రి అనిత పీఏ పోస్టు నుండి తొలగింపు.


SAKSHITHA NEWS