SAKSHITHA NEWS

ఏపీ క్యాబినెట్ సమావేశం!

హైదరాబాద్:జనవరి 02 సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఆరు నెలల పాలన పూర్తి కావడంతో ప్రభుత్వం పారిశ్రామికంగా దూకుడు పెంచుతోంది. క్లీన్ఎన‌ర్జీలో పెట్టుబ‌డులు పెట్టెందుకు రాష్ట్రానికి భారీ కంపెనీలు రానున్నాయి..

రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు రూ. 83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టు లను ఏర్పాటు చేయనున్నా యి. దీంతో కేవలం క్లీన్ ఎనర్జీ రంగంలోనే 2 ల‌క్షల 50 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నెల్లూరు జిల్లా రామయ్య పట్నంలో 6 వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వ‌చ్చింది. దీని వ‌ల‌న‌ 2,400 మందికి ఉపాధి కలగనుంది.

మొత్తం 9 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యం తో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రోకెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మించ‌నున్నారు.

వచ్చే 20 ఏళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి రూ. 88,747 కోట్ల ఆదాయం రానుంది.. 2029లోగా మొత్తం ప్రాజెక్టు పూర్తి కానుంది.విశాఖపట్నంలోని టీసీఎస్..మంత్రి వ‌ర్గ స‌మా వేశంలో దీనికి ఆమోదం తెల‌ప‌నున్నారు.

దీంతో పాటు.. విశాఖ పట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ. 80 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో 2 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. టీసీఎస్ ప్రతిపాద‌న‌కు క్యాబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది.

శ్రీ సత్యసాయి జిల్లా గుడి పల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ 70.71 ఎకరాల్లో మూడు దశల్లో వచ్చే ఆరేళ్లలో పూర్తయ్యే లా ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యా టరీ ప్యాక్‌ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది.

ఇందుకోసం ఈ సంస్థ రూ. 1,046 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 2,381 మందికి ఉపాధి కలుగనుంది..దీనికి కూడాఈరోజు క్యాబినెట్ ఆమోదం తెల‌ప‌నుంది..


SAKSHITHA NEWS