ముఖ్యమంత్రులు ఎవరైనా చంద్రబాబును చూసి నేర్చుకోవాలని

ముఖ్యమంత్రులు ఎవరైనా చంద్రబాబును చూసి నేర్చుకోవాలని

SAKSHITHA NEWS

Any Chief Minister should learn from Chandrababu

ఖైరతాబాద్ : ముఖ్యమంత్రులు ఎవరైనా చంద్రబాబును చూసి నేర్చుకోవాలని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫొటోతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఫొటో ఉంచాలని ఆదేశించి తన గొప్ప మనసును చాటుకున్నారని అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బొంకూరి సురేందర్‌ సన్నీ నూతనంగా ఏర్పాటుచేసిన ‘మాదిగ శక్తి సంఘం’ కరపత్రాన్ని ప్రొ.ఖాసింతో కలిసి మోత్కుపల్లి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 80 లక్షల జనాభా ఉన్న మాదిగలకు కాంగ్రెస్‌ టికెట్లు ఇవ్వలేదని, ఏపీలో చంద్రబాబు దామాషా ప్రకారం సీట్లు ఇవ్వడంతో పాటు మంత్రి పదవి ఇచ్చారన్నారు. ఏపీలో కాపులంతా పవన్‌ వెనుక ఉండటంతోనే పోటీ చేసిన 21 సీట్లు గెలిచారని, ఇప్పుడా కులానికి ఎంతో గౌరవం పెరిగిందన్నారు. తెలంగాణలో మాదిగలు డబ్బులిస్తే ఓటేస్తారన్న లెక్కలేని తనం ఉందని విమర్శించారు. తెలంగాణ క్యాబినెట్‌లో మాదిగలకు అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

WhatsApp Image 2024 06 22 at 13.23.59

SAKSHITHA NEWS