సీఎం జన్మదిన వేడుకల్లో అన్నదానం
** బీజేపీ రాష్ట్రనేత గుండాల గోపి హాజరు
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను రాయలసీమ రంగస్థలి – చిగోర ఆధ్యాత్మిక కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ రాష్ట్ర నేత గుండాల గోపినాథ్ రెడ్డి పాల్గొని పేదలకు అన్నదానం చేశారు. ముందుగా తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ తల్లి ఆలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో భక్తులకు అన్నప్రసాదాలను వితరణ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కేఎన్ రాజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు జనరంజక పాలన అందిస్తూ అటు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు.
ఆయనకు గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసారత్నం, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, రాయలసీమ రంగస్థలి కార్యదర్శి, చిగోరా ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు, తెలుగుదేశం టిఎన్.టియుసి తిరుపతి అధ్యక్షులు డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎల్.కృష్ణయ్య, రంగస్థలం ప్రతినిధులు గుండాల గోపినాథ్, పోలే జనార్దన్ రెడ్డి, ఎస్.మస్తాన్, లోక ప్రభాకర్ నాయుడు, శ్రీకాంత్, ప్రసాద్, చెంగల్ రాయలు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY