గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతనం చేయాలి ప్రసన్న
నెల్లూరు జిల్లా గ్రామ స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ కమిటీల ఏర్పాటుకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు తిరుపతి పార్లమెంటు సభ్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ కమిటిల ఏర్పాటు టాస్క్ ఫోర్స్ ఇన్ చార్జి మద్దిల గురుమూర్తి సూచనల మేరకు మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర పి.ఎ. సి. సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు లోని వారి నివాసంలో కోవూరు నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకులు, మరియు మండల పార్టీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీని కింద స్థాయి నుంచి బలోపేతను చేయాలని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలియజేశారు.

