
సాక్షిత :యడ్లపాడు గ్రామపంచాయతీ బొడ్రాయి దగ్గర ఉన్న అంగన్వాడి సెంటర్ నందు ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినది. 18 వ నుండి 21వ తారీకు వరకు ఆధార్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆధార్ క్యాంప్ నందు 0-5 సంవత్సరముల పిల్లలకు ఆధార్ నమోదు చేయుట ఆధార్ అప్డేట్ చేయుట జరుగుతుంది. 0-5 సంవత్సరంలోపు ఆధార్ లేని పిల్లలు ఆధార్ నమోదు చేయవలసినదిగా తెలియజేయడమైనది.ఈ కార్యక్రమం యడ్లపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి హేమలత దేవి పర్యవేక్షణలో జరిగినది. ఈ కార్యక్రమంలో యడ్లపాడు గ్రామపంచాయతీ శశికళ, డిజిటల్ అసిస్టెంట్లు ప్రసన్న మరియు స్వాతి పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app