SAKSHITHA NEWS

రాష్ట్ర పండుగగా” విశ్వకర్మ జయంతి”
జి.ఓ. 24 విడుదల చేసిన ప్రభుత్వం
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన.. రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జీవో అందజేత

నేటి అమరావతి, తాడేపల్లి ;

  సెప్టెంబర్ నెల 17వ తేదీన విశ్వకర్మ జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహనరెడ్డికి యావత్ విశ్వబ్రాహ్మణుల తరుపున ధన్యవాదములు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్… తోలేటి శ్రీకాంత్.
గురువారం ముఖ్యమంత్రి వై యస్. జగన్మోహన్ రెడ్డి సకల చేతి వృత్తులకు సృష్టికర్త , విశ్వబ్రాహ్మణుల ఆరాధ్య దైవం అయినభగవాన్ ” విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17″ ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ నేడు G.O..విడుదల చేయటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి ప్రభుత్వం విడుదల చేసిన జీవో కాపీ ఎం.ఎస్. నెంబర్ 24 ను ఛైర్మెన్ వారి చేతుల
మీదుగా తీసుకొని
ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

బీసీ సంక్షేమశాఖా మంత్రివర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకి …. చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
ఈనెల 17వ తేదీ రాష్ట్రంలోని అన్ని వృత్తులవారు” శ్రీ విశ్వకర్మ జయంతిని” అంగరంగ వైభవంగా నిర్వహించాలని తోలేటి శ్రీకాంత్ విశ్వబ్రాహ్మణలకు పిలుపునిచ్చారు.


SAKSHITHA NEWS