SAKSHITHA NEWS

అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, కళ్యాణదుర్గం సమన్వయకర్త తలారి రంగయ్య ప్రెస్‌మీట్‌

అనంతపురం జిల్లాలో రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

ఈ ఏడాది ఖరీఫ్‌లో అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు.

పండిన కొద్దిపాటి పంటలకు కూడా గిట్టుబాటు ధర అందడం లేదు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారులు, దళారులు కుమ్మక్కయ్యారు.

వరి, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి ఇతరత్రా పంటలకు మద్దతు ధర ప్రకటించినా అందుకు అనుగుణంగా అమ్ముకునే పరిస్థితి లేదు.

గత ఏడాది వరి ధాన్యం క్వింటాల్‌ ధర రూ.2700 నుంచి రూ.2800 ఉంటే ఇప్పుడు రూ.1700 వరకు మాత్రమే పలుకుతోంది.

రైతాంగం తరఫున వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్యాచరణ ప్రకటించారు.

ఈనెల 13వ తేదీన ఉదయం 10 గంటలకు అనంతపురంలోని జెడ్పీ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తాం.

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలు ప్రత్యేక దృష్టిపెట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులను భాగస్వామ్యం చేసుకుని తరలిరావాలి.

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన నిలుస్తుంది.

తలారి రంగయ్య కామెంట్స్‌ :

ఈనెల 13న రైతు సమస్యలపై నిర్వహించే ర్యాలీలో కూటమి భాగస్వామ్య పార్టీలు కాకుండా అన్ని పక్షాలు, మేధావులు, రైతు సంఘాలు పాల్గొనాలి.

వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.

పండిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు.

జిల్లాలో కిసాన్‌ రైలును పునరుద్ధరించాలి

వైసీపీ హయాంలో కిసాన్‌ రైలు 50 శాతం సబ్సిడీతో వస్తే.. ఇప్పుడా పరిస్థితి లేదు.

జిల్లాలో పండ్ల తోటలు అధికం. గిట్టుబాటు ధరతో పాటు మార్కెట్‌ సౌకర్యం కల్పించాలి.

కిసాన్‌ ఉడాన్‌ కింద వినామాల ద్వారా సరుకు తరలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. హెచ్‌ఎల్‌సీ ఆధునికీకరణ చేయాలి.


SAKSHITHA NEWS