SAKSHITHA NEWS

అణగారినవర్గాల సామాజిక, ఆర్థిక సాధికారతకు అంబేద్కర్ చేసిన పోరాటం సదా స్ఫూర్తిదాయకం : మాజీమంత్రి ప్రత్తిపాటి

  • అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన ప్రత్తిపాటి.

అణగారిన వర్గాల సామాజిక ఆర్థిక సాధికారత, విద్యకోసం అంబేద్కర్ రాజకీయాలకు అతీతంగా అంబేద్కర్ చేసిన పోరాటం సదా స్ఫూర్తిదాయకమని, సమసమాజ నిర్మాణంకోసం పాటుపడిన గొప్ప పోరాటయోధుడు అంబేద్కర్ అని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని పట్టనంలోని తూర్పుమాలపల్లెలో బీ.ఆర్.అంబేద్కర్ మెమోరియల్ కమిటీ ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను మాజీమంత్రి ప్రారంభించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన కబడ్డీ పోటీల నిర్వాహకుల్ని, క్రీడాకారుల్నిప్రత్యేకంగా అభినందించారు. పోటీల ప్రారంభానంతరం ప్రత్తిపాటి మాట్లాడారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని జాతీయ కబడ్డీ పోటీలు నిర్వహించాలన్న మంచి ఆలోచన వచ్చిన వెంటనే, దాన్ని ఆచరణలో పెట్టిన అంబేద్కర్ మెమోరియల్ కమిటీ నిర్వాహకుల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు పుల్లారావు చెప్పారు. కబడ్డీ పోటీలకు జాతీయస్థాయిలో రాణించిన జట్లు కూడా రావడం స్వాగతించాల్సిన విషయమని, వచ్చిన జట్లన్నీ మంచి ప్రదర్శన కనబరిచి క్రీడాస్ఫూర్తిని చాటాలని ప్రత్తిపాటి సూచించారు. మూడురోజుల పాటు జరిగే పోటీల్ని నిర్వాహకులు సమర్థవంతంగా నిర్వహించి చిలకలూరిపేటకు మంచి పేరు తీసుకురావాలన్నారు. క్రీడాకారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెల్లూరి సదాశివరావు, షేక్ టీడీపీ కరీముల్లా, జవ్వాజి మధన్ మోహన్, గంగా శ్రీనివాసరావు, కందుల రమణ, గట్టినేని సాయి, పిల్లి కోటి, పిల్లి లెనిన్, మైల గణేష్, గేరా రాము, రాజ్ కమల్, వడ్డాని సుబ్బారావు వడ్డాని చిన్న కొప్పుల రాంబాబు, మాణిక్యరావు, తదితరులు పాల్గొన్నారు