ప్రకాశం జిల్లా
మహనీయుడు అంబేద్కర్.
పుల్లలచెరువులో ఘనంగా అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు.
(పుల్లలచెరువు )
నవభారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆరాధ్యదైవం ,భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడని పలువురు వక్తలుఅన్నారు. శుక్రవారం పుల్లలచెరువు బస్టాండ్ సెంటర్ లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుతగా ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ ఉడుముల శ్రీనివాస్ రెడ్డి, ఎంపిపి లాజర్, మండల వైసీపీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ పేద ప్రజల అభ్యున్నతి, అభివృద్ధికి తన జీవితాంతం కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు.అంబేద్కర్ ఆశయాలు సాధించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపు నిచ్చారు. తన బాల్యంలోనే కుల వివక్షను, అంటరానితనం ను ఎదుర్కొని అవమానాలకు ఎదురు నిలచి ఉన్నత విద్యను అభ్యసించి ఆచంచల మేదస్సును పొంది, ప్రపంచ మేధావుల్లో ఒకరుగా నిలబడడం చారిత్రాత్మక విషయమని అన్నారు. రాజ్యాంగాన్ని రచించి, పేద వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని చెప్పారు.
సర్పంచ్ ఓబులేసు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమానికి ఎస్సీ సెల్ నాయకులు కోటేశ్వరరావు అధ్యక్షత వహించగా వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎల్. రాములు, పలు పంచాయతీల సర్పంచులు కోటిరెడ్డి, సత్తిరెడ్డి, మాజీ సర్పంచ్ కిష్టయ్య,ఉన్నత పాఠశాల తెలుగు పండితులు ఏడుకొండలు, నాయకులు రఘు, కాసయ్య, ఆకుల వెంకటేశ్వర్లు, బుజ్జి,,కమిటీ సభ్యులు గొట్టెముక్కుల.ఆంజి,ఎలిసల.పెద్ద నాసరయ్య, మాజీ అధ్యక్షుడు.గుంటి శ్రీను, వెంకటేశ్వర్లు హరిజన పాలెం యూత్ నాయకులు,అంబేద్కర్ అభిమానులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.