SAKSHITHA NEWS

క్రీడలతో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యం పెంపొందుతుంది : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

సాక్షిత : మేడ్చల్ నియోజకవర్గం దేవర యాంజాల్ లోని సన్ ఫ్లవర్ వేదిక్ స్కూల్ వేదికగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన 68వ ఎస్జిఎఫ్ తెలంగాణ స్టేట్ లెవెల్ అండర్ -14 (బాయ్స్ & గర్ల్స్) బాస్కెట్ బాల్ టోర్నమెంట్ కం సెలక్షన్స్ 2024 -25 క్రీడా కార్యక్రమానికి మాజీ మంత్రి & ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి , కెపి.వివేకానంద్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారుల నుంచి మార్చి ఫస్ట్ తో వందనం స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రీడాకారుల్లో చురుకుదనం, మానసిక ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తుందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలన్నారు.

అనంతరం క్రీడా సంబరం ప్రారంభ సూచికగా ముఖ్య అతిథులు గాల్లోకి బెలూన్లను వదిలి ట్రోపీలను ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్ కి తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలకు దాదాపు 300 మంది విద్యార్థులు పోటీ పడనున్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ రాహుల్, ఫిజికల్ డైరెక్టర్ ప్రశాంత్, పేట ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చెన్నకేశవ రెడ్డి, మేడ్చల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కిష్టయ్య, సన్ ఫ్లవర్ వేదిక్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ సరిత కుమార్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS