శెట్టిపల్లి లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు వేగిరం
** జిల్లా కలెక్టర్ తో కలసి “తుడ” చైర్మన్ దివాకర్ మీటింగ్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని శెట్టిపల్లి లే అవుట్ డెవలప్మెంట్ పనులను పూర్తి చేసి అర్హులైన వారికి ప్లాట్లు కేటాయించాలని “తుడ”” చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కోరారు. వేగవంతం చేసి లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడానికి సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.
గురువారం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో శెట్టిపల్లి లే అవుట్ డెవలప్మెంట్ పనులపై జిల్లా కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ మౌర్య, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దివాకర్ రెడ్డి, సంబందిత అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
శెట్టిపల్లిలో ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన లేఔట్ నిర్మాణం జరుగుతుందనీ, అందులో రోడ్లు, డ్రైనేజ్, త్రాగునీటి పైపులు, విద్యుత్, పార్కులు వంటి సదుపాయాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
లే అవుట్ డెవలప్మెంట్ పనులను అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని త్వరితగతిన పూర్తి చేయాలని, జంగిల్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలన్నారు.
ఈ సమావేశంలో తిరుపతి ఆర్.డి.ఓ రాంమోహన్, తుడా చీఫ్ ప్లానింగ్ అధికారి దేవి కుమారి, తుడా భూ సేకరణ అధికారి సుజన, తుడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి వాణిశ్రీ, సూర్య నారాయణమ్మ, తుడా ఈఈ రవీంద్రనాధ్, ఎస్.ఈ కృష్ణా రెడ్డి, తిరుపతి అర్బన్ తహసీల్దార్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
