బైక్ కేర్ సర్వీస్ సెంటర్ ప్రారంభం
** “తుడ” చైర్మన్ దివాకర్ రెడ్డి చేతుల మీదుగా
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: స్థానిక తిరుమల బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సౌమ్యనాధ ప్రీమియం బైక్ కేర్ కేంద్రాన్ని “తుడ” చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు.
ఆధునిక సదుపాయాలతో, ప్రీమియం క్వాలిటీ అల్ట్రా వన్ ప్లస్ ల్యూబ్రికెంట్స్ అందించే ఈ బైక్ కేర్ సర్వీస్ సెంటర్ ద్వారా, నగర యువతకు మెరుగైన సేవలు అందుతాయని తుడా చైర్మన్ అండ్ టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి అభినందించారు. స్వయం ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ, ఇలాంటి నూతన సర్వీస్ యూనిట్లు తిరుపతి నగర అభివృద్ధికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బైక్ కేర్ నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
