జగత్గిరిగుట్టలో భవన నిర్మాణ కార్మికులకు స్థలం కేటాయించండి.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్.
సాక్షిత : జగత్గిరిగుట్టలో గతంలో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల అడ్డాలొ నేడు నిలబడే పరిస్థితి లేదని అక్కడ మొత్తం భవనాలు,బస్సులు, ప్రయాణికులతో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని కావున జగత్గిరిగుట్టలో పని చేస్తున్న సుమారు 500మంది భవన నిర్మాణ కార్మికులకు శాశ్వతమైన అడ్డాను చూపించాల్సిందిగా నేడు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక శాఖ ఉప కార్యదర్శి ఈ. గంగాధర్ కి అంజయ్య భవన్లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా భవన నిర్మాణ కార్మికులకు శాశ్వతమైన అడ్డాను ఏర్పాటు చెయ్యాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక వినతులు ఇచ్చామని నేటి వరకు అమలు కావట్లేదని,జగత్గిరిగుట్టలో ప్రభుత్వ భూమి ఉందని అది అన్యక్రాంతం అవుతుందని,స్థలం ఉన్నపుడే తగిన నిర్ణయం తీసుకుంటే వందలాది కార్మికులకు సహాయం చేసిన వాళ్లు అవుతారని కావున తమరు కార్మిక శాఖ నుండి జిల్లా కలెక్టర్ కి స్థలం కేటాయింపు కొరకు ఉత్తరం రాస్తే స్థలం కేటాయిస్తారని కావున ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
దీనికి వారు స్పందిస్తూ సంబందించిన శాకకు తెలియచేసి కార్మికుల సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్,ఏఐటీయూసీ అధ్యక్షుడు హరినాథ్,భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు రవి,రాము,సామెల్ తదితరులు పాల్గొన్నారు.