SAKSHITHA NEWS

దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండ -MLA బొండా ఉమ

” సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయనిది నిరుపేదలకు అత్యవసర సమయాల్లో ఆసరాగా నిలుస్తోంది అని నియోజకవర్గం లోని
64 వ డివిజన్ కండ్రిక కు చెందిన Y. కమలాకర్ కి ₹91,033 రూపాయల చెక్కును ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు CMRF చెక్కులను  పంపిణీ చేశారు….

ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:-దివ్యాంగులు సంఘటింతంగా ఉండి వారి ఆర్థిక ,సామాజిక అభివృద్ధి కోసం స్వయం సహకార సంఘాలుగా ఏర్పడేందుకు ప్రభుత్వం తరపున ప్రోత్సహిస్తామని,ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ సహాయం తో పాటు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు..

అనారోగ్య పరిస్థితుల వల్ల ఆర్థికపరమైన కష్టాలు ఎదుర్కొంటున్న వారు వారి సమస్యలు మా దృష్టికి తీసుకుని రాగ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థికంగా వారికీ సహాయం అందిస్తున్నాం అని..

నియోజకవర్గంలోని 100 మంది దివ్యాంగులకు ఉపకరణముల పంపిణీ దివ్యాంగులకు సుమారు ₹7 లక్షల విలువ కలిగిన ఉపకరణాలు పంపిణీ కూడా చేయడం జరిగింది అని,మూడు చక్రాల బండ్లు,బ్యాటరీ తో నడిచే మోటరు సైకిళ్ళు, వీల్ ఛైర్స్  ,చెవిటి మిషన్లు మరియు.ఇతర ఉపకరణలు పంపిణీ చేసి దివ్యాంగులకు చేదోడు వాదోడుగా ఉంటున్నామని..

ఈరోజు అత్యవసర పరిస్థితుల్లో ఉండి వైద్యం చేయించుకోలేని వారికి  చేయూతనిస్తూ వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో సతమవుతమవుతున్న అభాగ్యుల జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి వెలుగులు నింపుతుందని…

అధికారంలోకి వచ్చిన నాటి నుండి పేద ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, ముఖ్యమంత్రి మన చంద్రన్న అడిగిన వెంటనే అపన్న హస్తం అందేలా చర్యలు తీసుకుంటున్నారని, ఆర్థిక స్తోమత లేని అనేక మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని…

లబ్ధిదారులందరూ కూటమి ప్రభుత్వం చేసిన సహాయాన్ని గుర్తించాలని, కష్టాలలో మనకి తోడుగా ఉన్న వారిని మర్చిపోకూడదు అని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎంతోమందికి సహాయం అందుతుందని..

అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తుందని..

ముఖ్యమంత్రి సహాయ నిధి అందించిన ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు కి, సెంట్రల్ MLA  బొండా ఉమ కి దివ్యాంగులు కృతజ్ఞతలు తెలిపారు….

ఈ కార్యక్రమంలో:- కాకోల్లు రవికుమార్,ఘంటా కృష్ణమోహన్,కోలా శ్రీను, తేళ్ల భవాని,నాగమణి,Sk గౌసియా, Sd గౌసియా తదితరులు పాల్గొన్నారు…