రోడ్ల మరమ్మతు, నిర్మాణ పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి నాటికి పూర్తి కావాలి : మాజీ మంత్రి ప్రత్తిపాటి
సంక్రాంతి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా రోడ్లపై గుంతలు.. పెద్ద పెద్ద గోతులు ఉండటానికి వీల్లేదు అన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఆదేశాల్లో భాగంగా, పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రూ. 10 లక్షల వ్యయంతో జరుగుతున్న రోడ్ల నిర్మాణ, మరమ్మతు పనులను మాజీ మంత్రి పుల్లారావు స్వయంగా పరిశీలించారు. కాంట్రాక్టర్లు, మున్సిపల్ అధికారులతో మాట్లాడి పనుల పురోగతి గురించి తెలుసుకున్న ఆయన ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి నాటికి పనులన్ని పూర్తి కావాలని సూచించారు. అవసరమైతే ఎక్కువమంది పనివారిని పెట్టి, నిర్దేశిత సమయానికి పనులు మొత్తం పూర్తి అయ్యేలా చూడాలని ఆయన గుత్తేదారులు, అధికారుల్ని ఆదేశించారు. పనుల్లో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడకుండా గుత్తేదారులు, అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని పుల్లారావు సూచించారు. రోడ్ల మరమ్మతులు, నిర్మాణ పనుల పరిశీలనలో భాగంగా మాజీమంత్రి పురుషోత్తమపట్నం, పండరిపురం ప్రాంతాల్లోని 29, 35, 36 వార్డుల్లో జరుగుతున్న రోడ్ల పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డిఈ రహీం, నాయకులు తోట రాజా రమేష్, టీడీపీ కరిమూల్లా, పఠాన్ సమథ్ ఖాన్, మద్దుమలా రవి, కాన్సిలర్లు , పార్టీ నాయకులు తదితరులున్నారు.