
సంఘర్షణలన్నీ అహింసతోనే పరిష్కరించుకోవాలి.
మహాత్ముని బాటలోనే అందరం పయనించాలి.
-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు
ఘనంగా జాతిపిత మహాత్ముని వర్ధంతి
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్,
సంఘర్షణలన్నీ అహింసతోనే పరిష్కరించుకోవాలని బోధించిన మహాత్ముని బాటలోనే అందరం పయనించాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు మహాత్మాగాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మహాత్మునికి జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీజీ జీవితం యావత్ ప్రపంచానికే స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి సమస్య శాంతి, అహింసతో పరిష్కరించబడాలనే మహాత్ముని ఆకాంక్ష ఎందరికో మార్గదర్శకమన్నారు. మనదేశ స్వాతంత్ర్య సముపార్జనలో మహాత్ముని కృషి అనిర్వచనీయమన్నారు. నిజాయితీతో కూడిన ఆయన పోరాట పటిమ ఎందరిలోనో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చిందన్నారు. మహాత్ముని అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను సాధిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app