SAKSHITHA NEWS

అమ్మ భాష తర్వాతే ఇంగ్లీష్ భాష: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

హైద‌రాబాద్:
హైదరాబాద్ లో లోక్ మంథన్ కార్యక్రమాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మ భాషకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని,అమ్మ భాష తర్వాతే ఇంగ్లీష్ భాష అని సూచించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

భారత సంస్కృతిని వెలికి తీసేందుకే ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయని, సంస్కృతిని ఎదుర్కోవడం అందరి బాధ్యత అన్నా రు.పిల్లలను సున్నితంగా పెంచకుండా చిన్న తనం నుంచే కష్టం అంటే ఏంటో తెలిసేలా పెంచాలని కోరారు.

హైదరాబాద్‌లోని శిల్ప‌రామంలో ఏర్పాటు చేసిన లోక్‌ మంథన్ కార్యక్రమాన్ని ఆయ‌న జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోవాలని సూచించారు. పెద్దలను గౌరవించేలా పిల్లలను తయారు చేయాలని అన్నారు.

లోక్ మంథన్ కార్యక్ర మంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను ప్రారంభించటం త‌న‌కు ఆనందదాయకంగా ఉంద‌ని వెంక‌య్య అన్నారు.. చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వా హకులను ఆయ‌న అభినందించారు.

నేటికీ ప్రకృతితో కలిసి జీవిస్తూ, సామాజిక ప్రధాన జీవన స్రవంతిలో మరుగు పడిన వర్గాలను, మనం నాగరికం అనుకుంటున్న సమాజానికి తిరిగి చేరువ చేసి, నేటి యువతకు నిజమైన ధర్మాన్ని తెలియ జేయటమే లక్ష్యంగా సాగుతున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆయ‌న ఆకాంక్షించారు.

మన సంస్కృతి మీద జరిగిన దాడుల‌తో, , మనదైన సంస్కృతిని దూరం చేసి, అనేక ప్రతికూల భావనలను మన మనసుల్లో నాటాయ‌ని వివ‌రించారు మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి..

ఈ జాఢ్యాలను వదిలిం చుకుని, మూలాలను తిరిగి తెలుసుకుని, భారతీయ విజ్ఞానాన్ని అందిపుచ్చు కుని భవిష్యత్ తరాలకు మన ధర్మాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను, భాషను మరింత చేరువ చేయాలని కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS