SAKSHITHA NEWS

అద్విక 24 టెక్ ఫెస్ట్ బ్రోచర్ ఆవిష్కరించిన వీసీ
సాక్షిత రాజానగరం :
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19,20 తేదీలలో “అద్విక 24” జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ ను నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య వై శ్రీనివాసరావు తెలిపారు. విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ ఫ్రెషర్స్ పార్టీలో “అద్విక-24” జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ కు సంబంధించిన బ్రోచర్ ను వీసీ ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. యూనివర్సిటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు (సెప్టెంబర్ 19,20 తేదిలలో) నిర్వహిస్తున్న జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ “అద్విక-24”ను నిర్వహిస్తున్నారని అన్నారు. అద్విక టెక్ ఫెస్ట్ లో పేపర్ ప్రేజెంటేషన్స్, పోస్టర్ ప్రేజెంటేషన్స్, టెక్ క్విజ్, ప్రాజెక్ట్ ఎక్స్పో, షర్ట్ ఫిల్మ్ మేకింగ్, ప్రెజెంటేషన్ ఆఫ్ ఐడియా విత్ వర్కింగ్ హైపోథిసిస్ డిబిట్ వంటి సాంకేతిక కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు.

ఇంజనీరింగ్ తో పాటు కంప్యూటర్ సంబంధిత కోర్సులు చేస్తున్న విద్యార్థులందరూ దీనిలో పాల్గొనేందుకు అర్హులేనని తెలిపారు. రెండు రోజుల టెక్ ఫెస్ట్ లో పాల్గొనేందుకు ఆన్ లైన్ ద్వారా రూ.200తో రిజిష్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. అద్విక 24 టెక్ ఫెస్ట్ కు కన్వీనర్ గా ప్రిన్సిపాల్ డా.పి.వెంకటేశ్వరరావు, కోకన్వీనర్ గా సైన్స్ అండ్ హ్యూమనిటీస్ ఇంజనీరింగ్ కోర్సు కోఆర్డినేటర్ డా. జి. కీర్తి మరిట వ్యవహరిస్తున్నారని అన్నారు. అడ్వైజరీ కమిటీ మెంబర్స్ గా పి.సురేష్ వర్మ, వి.పెర్సిస్, ఎం.కమలకుమారి, బి.కెజియారాణి, డి.లతా మరియు ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ గా డా.జి.వెంకటరావు, డా.డి.అప్పలరాజు, ఎం.బాలకృష్ణ, డి.రాంబాబు, బి.వి.అలిబాబా మరియు స్టూడెంట్ కోఆర్డినేటర్స్ కార్యక్రమాలను నిర్వహిస్తారని చెప్పారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ aknu.edu.in ద్వారా సంప్రదించాలన్నారు.


SAKSHITHA NEWS