SAKSHITHA NEWS

బిసి కమీషన్ నిర్వహించనున్న బహిరంగ విచారణ వాయిదా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థలలో వెనుకబాటుతనం యొక్క స్వభావం, ప్రభావాన్ని సమకాలీన, క్షుణ్ణమైన, అనుభవపూర్వక విచారణను నిర్వహించడానికి తెలంగాణ బిసి కమీషన్ నిర్వహించనున్న ఉమ్మడి జిల్లాల బహిరంగ విచారణ అనివార్య పరిస్థితుల కారణంగా ప్రభుత్వం వాయిదా వేసిందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అట్టి విషయాన్ని తెలుపబడునని, ఉమ్మడి జిల్లాలోని ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


SAKSHITHA NEWS