SAKSHITHA NEWS

ఆదివాసీల వేగు చుక్క కొమురం భీమ్ : నీలం మధు ముదిరాజ్..

తెలంగాణ విముక్తి కోసం, నిజాం కార్యకలాపాలకు వ్యతిరేకంగా తనదైన శైలిలో పోరాడిన పోరాట యోధుడు కొమురం భీమ్ అని మెదక్ పార్లమెంటు కంటెస్టేడ్ కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.
కొమురం భీం జయంతి సందర్భంగా చిట్కుల్ లోని క్యాంపు కార్యాలయంలో కొమురం భీమ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ,దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వారితో విరోచితంగా పోరాడినటువంటి పోరాట యోధుడు కొమరం భీమ్ అన్నారు.ఆదివాసీల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి అణగారిన వర్గాలకు ఆత్మబంధువుగా మారాడని తెలిపారు.


అడవులను నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలపై నిజాం సర్కార్‌ పాశవిక చర్యలకు పాల్పడిన సందర్భంలో ‘జల్‌, జంగల్‌, జమీన్‌’ నినాదంతో నిజాం సర్కారుపై భీకరంగా పోరాడి వీర మరణం పొంది ఆదివాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని కొనియాడారు.
ఆ మహావీరుడు పోరాట స్ఫూర్తిని నేటి తరం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వి నారాయణరెడ్డి,మురళీ,
గోపాల్,ఉళ్ళ శంకర్,మన్నే
రాఘవేంద్ర, కంజార్ల రవి,విష్ణువర్థన్, ప్యట గోపాల్,సోములు,మల్లేశం,మనోహర్,మణికంఠ,
తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS