
నటుడు శివాజీ ఔత్సాహిక యువతను సినీరంగంలో ప్రోత్సహించడం అభినందనీయం : మాజీమంత్రి ప్రత్తిపాటి.
….
సాక్షిత :పల్నాడు, తనను గొప్పవాడిని చేసిన చిత్రపరిశ్రమ పురోభివృద్ధికి నటుడు శివాజీ తనవంతు సేవ చేయడం, ముఖ్యంగా ఆసక్తి ఉన్న యువతను సినీరంగంలో ప్రోత్సహించడం చాలా గొప్ప విషయమని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం ఆయన నటుడు శివాజీ స్వగ్రామం గొరిజవోలులో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్-2 బ్యానర్ పై నిర్మిస్తున్న నూతన చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కొత్త చిత్రం నిర్మాణంలో నూతన నటీనటుల్ని ప్రోత్సహిస్తున్న శివాజీకి అభినందనలు తెలియ చేశారు ప్రత్తిపాటి. యువత తమకు నచ్చిన రంగంలో రాణించాలంటే ఆసక్తి ఒక్కటే సరిపోదని, కృషి..పట్టుదల.. సమయస్ఫూర్తి కూడా అలవరుచుకోవాలన్నారు.
గుర్రం స్వాములు నిర్మాణసారథ్యంలో ప్రారంభమైన కొత్త చిత్రం త్వరితగతిన షూటింగ్ పూర్తిచేసుకొని థియేటర్లలో తెలుగుప్రజల్ని మెప్పించాలని పుల్లారావు ఆకాంక్షించారు. చిత్రయూనిట్ కు ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పిన ప్రత్తిపాటి నియోజకవర్గంలో వారంపాటు జరిగే చిత్రీకరణకు తగిన సహాయసహకారాలు అందిస్తానని చెప్పారు.
కార్యక్రమంలో డైరెక్టర్ సుధీర్, కెమెరా మెన్ రీత్విక్ మరియు చిత్ర బృందంతో పాటు, గొరిజవోలు గ్రామస్తులు, నటుడు శివాజీ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు బండారుపల్లి సత్యనారాయణ, షేక్ టిడిపి కరీముల్లా, మద్దూరి వీరారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గట్టినేని రమేష్, బ్రహ్మయ్య, వాలేటి హిమమాంతరావు తదితరులున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app