SAKSHITHA NEWS

డ్రగ్స్ కేసులో నటుడు మన్సూర్ అలీ ఖాన్ కొడుకు అరెస్ట్

నటుడు మన్సూర్ అలీఖాన్ కొడుకు అలీఖాన్ తుగ్లక్, డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. అతడు డ్రగ్స్ అమ్మినట్లు, అలాగే వాడినట్లు పోలీసులు వైద్యపరీక్షల్లో నిర్ధారించారు. గత వారం కార్తికేయన్ అనేవ్యక్తితో సహా 10 మంది కాలేజీ విద్యార్థులను డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించి జె.జె.నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో కార్తికేయన్ ద్వారా అలీఖాన్ ఆన్లైన్లో డ్రగ్స్ కొని, అమ్మారని, వాడారని తేలింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేశారు.


SAKSHITHA NEWS