అమరావతి: హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రమాదాలు జరిగినప్పుడు వాహన దారులు ప్రాణాలను కోల్పోతుండటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింది. మోటారు వాహన చట్ట నిబంధనలు తు.చ. తప్పకుండా అమలయ్యేలా చూడాలని స్పష్టంచేసింది. నిబంధనలను ఏమేరకు అమలు చేస్తున్నారో వివరిస్తూ కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాహనాల తనిఖీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు బాడీ కెమెరాలను తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఉపేక్షించవద్దని..తీవ్రంగా పరిగణించాలని తేల్చిచెప్పింది. హెల్మెట్లు ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఏపీ న్యాయసేవాధికార సంస్థను ఆదేశించింది. మోటారు వాహనాల చట్ట నిబంధనలను తెలియజేస్తూ అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ప్రాంతీయ, జాతీయ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది.
హెల్మెట్లు ధరించకపోవడంతో ప్రమాదాలు
Related Posts
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి
SAKSHITHA NEWS సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ కుటుంబసభ్యులతో మాట్లాడి.. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న నిర్మాత అల్లు అరవింద్…. SAKSHITHA NEWS
మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూముల
SAKSHITHA NEWS మల్కాజిగిరి నియోజకవర్గంలోనివక్ఫ్ భూములలోని వివిధ సర్వే నెంబర్ లలో రిజిస్ట్రేషన్ నిలిపివేతపై..బాధితులకు…న్యాయం చేయాలని కోరుతూ…బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందచేసిన ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి SAKSHITHA NEWS