ఏబీవీపీ సూర్యాపేట నగర కార్యదర్శిగా నవీన్
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) సూర్యాపేట శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా (ABVP) ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ సుర్వి మణికంఠ విచ్చేసి మాట్లాడుతూ ఏబీవీపీ 1949,జూలై, 9 న కేవలం ఐదుగురు విద్యార్థులతో ప్రారంభమై 2024 నాటికి 55 లక్షల మంది విద్యార్థులతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా విరాజిల్లుతుందన్నారు.
ABVP విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేస్తూ విద్యార్థులను జాతీయవాదులుగా తయారు చేస్తూ గత 75 సంవత్సరాలుగా కాలేజీ క్యాంపస్ ను ఆధారం చేసుకుని పనిచేస్తుందని వారు అన్నారు , ABVP నూతన నగర కమిటీని ABVP సూర్యపేట జిల్లా కన్వీనర్ వడ్లకొండ వేణు ప్రకటించడం జరిగింది. సూర్యాపేట నగర కార్యదర్శిగా నవీన్ సంయుక్త కార్యదర్శిగా ప్రవీణ్, వికాస్ ఉపాధ్యక్షుడిగా భరత్, శివశంకర్, SFD కన్వీనర్ గా మహేష్, SFS కన్వీనర్ గా నందు, ఖేల్ కన్వీనర్ గా ఏలియా, టెక్నికల్ కన్వీనర్ గా గోపి, నగర కార్యవర్గ సభ్యులుగా వేణు, జగన్,నాగరాజు గణేష్ లను ఎన్నుకోవడం జరిగింది.