SAKSHITHA NEWS

కొడిమ్యాల:వందేమాతరం ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ప్రముఖ డాన్సర్ కొట్టాల హంసిని రెడ్డిని ఆదివారం ఘనంగా సన్మానించారు. హంసిని గత కొద్ది కాలంగా హిందూ సంప్రదాయ నృత్యాలను ప్రదర్శిస్తూ వీక్షకులను అలరించడంతోపాటు, భక్తి భావనలను పెంపొందిస్తున్నదని యూత్ సభ్యులు ప్రశంసించారు. హంసిని గతంలో జిల్లా స్థాయిలో ఉత్తమ డాన్సర్ గా ఎంపిక అవడంతో పాటు, తిరుపతిలోనూ నృత్య ప్రదర్శన ఇవ్వడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గా దేవి ప్రముఖులు బైరి రవీందర్, బైరి వెంకటి, ఏనుగు ఆదిరెడ్డి, గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కొట్టాల తిరుపతిరెడ్డి, వందే మాతరం ఫ్రెండ్ యూత్ సభ్యులు, చత్రపతి శివాజీ యూత్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS