లోకేష్ కు కన్నీటి వీడ్కోలు
- బారులుతీరిన గ్రామ ప్రజలు – ఉద్వేగ భరితంగా అంతిమయాత్ర
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ గండివానిపాలెం గ్రామంలో వైఎస్ఆర్సిపి కార్యకర్త నారపిన్ని లోకేష్ అకాల మరణం చెందగా ఉదయం పదిగంటల నుండి లోకేష్ భౌతిక కాయాన్ని ఆయన నివాసం నుండి స్మశానం తీసుకువెళ్లి అంతమ క్రియలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు,పార్టీనాయకులు,కార్యకర్తలు,అభిమానులు,మరియు మహిళలు భారీ ఎత్తున పాల్గొని చివరికి కన్నీటి వీడ్కోలు పలికారు.