SAKSHITHA NEWS

గాజువాకలో కలాసీల ఆత్మీయ సమావేశం

హాజరైన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

ఏకతాటిపైకి18 కలాసీ సంఘాలు

గాజువాక:-కలాసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు.అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 18 కలాసీ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి శ్రీ సూర్య దుర్గ కలాసీ సంక్షేమ సంఘంగా ఏర్పడింది.సంఘం ఆధ్వర్యంలో కలాసీల ఆత్మీయ సమావేశాన్ని టీడీపీ కార్యాలయ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేశారు.ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఎన్నికల సమయంలో కలాసీలకు ఏమైతే హామీ ఇచ్చానో వాటికి కట్టుబడి ఉన్నానని తెలిపారు.కలాసీ భవనం ఏర్పాటుకు కావాల్సిన స్థలం కేటాయింపు,ఇతర సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు.తెదేపా సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాన్ని ఈ సందర్భంగా వారికి తెలియజేసారు.

ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడే వారే కళాసీలని అన్నారు.అటువంటి వారికి ప్రభుత్వ పరంగా కావాల్సిన ప్రోత్సాహాన్ని అందిస్తామని చెప్పారు.సభ్యత్వం తీసుకోవడం ద్వారా ఇన్సూరెన్స్ పొందవచ్చని తెలిపారు.నిజమైన కష్ట జీవులుగా పిలవబడే కలాసీలు ఆర్ధికంగా బలపడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం సంఘం తరపున పల్లాను ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి,కార్పొరేటర్ బొండా జగన్,70 వ వార్డు అధ్యక్షుడు చట్టి గోపి,సంఘం అధ్యక్షుడు పైల దేముడు,ఉపాధ్యక్షుడు గోపిశెట్టి ఆనంద్,కార్యదర్శి గొలగాని శ్రీనివాస్,సహాయ కార్యదర్శి నందిపల్లి దేముడు,కోశాధికారి ఈగల తాతారావు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS