
ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన
నేత్ర వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం
టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా
పేదలకు ఖర్చు లేకుండా కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లను నిర్వహించడం అభినందనీయమని టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా అన్నారు.
ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని ) ఎమ్మెల్యే సుజనా చౌదరి , టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా సారధ్యంలో టిడిపి సీనియర్ నాయకులు గుర్రంకొండ, 46వ డివిజన్ అధ్యక్షులు దీటీ ప్రభుదాస్ ఆధ్వర్యంలో శంకర నేత్ర వైద్యాలయ కంటి వైద్యుల సహకారంతో చిట్టి నగర్ 46 వ డివిజన్ మార్కు పేట నందు బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ శిబిరాన్ని ప్రారంభించారు. కంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందులను అందజేశారు.
ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి అవసరమగు వారికి శస్త్ర చికిత్సలను చేస్తుందని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
సున్నితమైన కంటి వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఎమ్మెల్యే సుజనా చౌదరి విడతల వారీగా ఉచిత మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
ఈ శిబిరంలో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 100 మందికి శస్త్ర చికిత్సలు అవసరం అయ్యాయని శంకర్ కంటి ఆసుపత్రి వైద్యులు పీ సంధ్యారాణి , సునీల్ కుమార్ లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు బెవర లోకేష్, శ్రీనివాస్, కాజా రహమతుల్లా, చుక్కా నరేష్, హర్షద్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app