హఫీజ్పెట్ లోని జలమండలి కార్యాలయం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని మరియు మంచి నీటి సరఫరా మరియు UGD నిర్వహణ పై జలమండలి అధికారులు , కార్పొరేటర్లు శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి , ఉప్పలపాటి శ్రీకాంత్ , జలమండలి అధికారులతో కలిసి సమీక్షా సమావేశం జరిపిన గౌరవ PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ పలు కాలనీ వాసుల నుండి వచ్చిన వినతి పత్రాలను పరిగణలోకి తీసుకొని అత్యవసర పనుల పై తక్షణమే స్పందించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ప్రతి ఫిర్యాదు పై స్పందించాలని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండలని , ప్రజల నుండి వచ్చే ప్రతి అర్జీ పరిష్కారానికి కృషి చేయాలని,ప్రజలకు ఎల్లవేళలో అందుబాటులో ఉండలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
పలు కాలనీల నుండి కాలనీ వాసులు వచ్చి నేరుగా ప్రజావాణి లో వారి సమస్యల ను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగినది. కొన్ని కాలనీలలో మంచి నీటి విడుదల సమయం పెంచాలని, ప్రెజర్ తగ్గుతుంది అని, మంచి నీటి విడుదల సమయం లో ప్రెజర్ ను పెంచాలని , కొన్ని కాలనీలలో నిత్యం డ్రైనేజి పొగుంతుంది అని , వినతి పత్రం ద్వారా విన్నవించుకున్నారు అని,
ప్రజలకు సురక్షితమైన మంచి నీళ్లు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ,ప్రజలకు మెరుగైన మంచి నీటి సరఫరా అందించాలని , ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గాంధీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగినది.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సమగ్ర , సంతులిత అభివృద్ధి లో భాగంగా ప్రతి డివిజన్ల లో మౌళికవసతుల కల్పన కొరకై ప్రతి డివిజన్ లో అవసరమైన మంచి నీటి పైప్ లైన్ నిర్మాణం మరియు UGD పైప్ లైన్ నిర్మాణ పనులకు ప్రతిపాదనలు తీసుకోవడం జరిగినది అని,పనులు త్వరిత గతిన చేపట్టాలని, అత్యవసర పనుల ను గుర్తించి,ప్రథమ ప్రాధాన్యత గా పనులు గుర్తించి త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు తెలియచేసిన ఎమ్మెల్యే గాంధీ అదేవిధంగా జలమండలి అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలని, అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, మంచి నీటి సరఫరా వ్యవస్థ మరియు డ్రైనేజి వ్యవస్థ పై సమీక్షా జరపడం జరిగినది అని,అసంపూర్తిగా మిగిలిపోయిన UGD పనులను త్వరితగతిన పూర్తి చేయాలని , మంచి నీటి వ్యవస్థ ను సరిగ్గా నిర్వహించాలని,ఎండాకాలం లో మంచీ నీరు కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతి పై సమీక్షా జరపడం జరిగినది. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు GM నారాయణ ,DGM వెంకటేశ్వర్లు , DGM శరత్ రెడ్డి,DGM నరేందర్ రెడ్డి, మేనేజర్లు సుబ్రమణ్యం ,యాదయ్య, సందీప్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, సునీత
మరియు రఘునాథ్ రెడ్డి, బాలింగ్ గౌతమ్ గౌడ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ మరియు
తదితరులు పాల్గొన్నారు