SAKSHITHA NEWS

యువతకు, ఔత్సహిక ఫోటోగ్రాఫర్లకు ఫోటోగ్రఫీ,షార్ట్ ఫిలిమ్ పోటీలకు ఆహ్వానం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్

శాంతి భద్రతల మరియు సమాజ రక్షణలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా పెట్టి, పోరాడి వీరమరణం పొందిన అమర పోలీసుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 నాడు జరుగు “ పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశం మీద ఫోటో గ్రఫీ మరియు షార్ట్ ఫిలిం తీయడానికి జిల్లాలో ఆసక్తి గల యువతక ఔత్సహిక ఫోటోగ్రాఫర్లు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఒక ప్రకటనలో కోరారు. ఇందులో భాగంగా పోలీసుల త్యాగాలు,

పోలీసు విధుల్లో ప్రతిభను తెలిపే విధంగా ఉండే తీసిన (3) ఫోటోలు మరియు తక్కువ నిడివి (3 నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ తీసి రాష్ట్రస్థాయి పోటీల కోసం ఈనెల 20వ సాయంత్రం వరకు మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అందజేయాలన్నారు. ఇట్టి షార్ట్ ఫిలిం 3 నిమిషాలు మించకూడదు, 10 x 8 సైజ్ ఫోటోలను ,షార్ట్ ఫిలింను సిడిలో లేదా పెన్ డ్రైవ్ లో మీ యెక్క పూర్తి వివరాలతో అందజేయగలరని మనవి. జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయిన మూడు షార్ట్ ఫిలింలను స్టేట్ కాంపిటేషన్ గురించి డీజీపీ ఆఫీస్ హైదరాబాదుకు పంపించడం జరుగుతుంది.


SAKSHITHA NEWS