రాబోయే లోక్ సభ ఎన్నికలలో ప్రజలు తమ ఓటు హక్కును ఏలాంటి ప్రలోబాలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునేందుకు, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలు, స్థానిక పోలీస్ అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం జరుగుతుందని ITBP బలగాల డి. ఐ. జి సురేందర్ కత్రి , జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్,IPS అన్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయం లోని ఎస్పీ ఛాంబర్ నందు జిల్లా లో రాబోయే లోక్ సభ ఎన్నికలను జిల్లా పోలీస్ అధికారులు, ITBP ఫోర్స్ అదికారులు సమన్వయం చేసుకుంటూ ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.
అందులో భాగంగా జిల్లా లో సమస్యాత్మక గ్రామాలలో ఎన్నికల సందర్భంగ అనుసరించాల్సిన విధివిధానాలు, రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నగదు , మధ్యం రవాణ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల పై సమీక్షించారు. మరియు జిల్లా లో కొనసాగుతున్న కేంద్ర బలగాల కవాతు, వాహనాలు తనిఖీలు,ఇంక జిల్లాకు వచ్చే కేంద్ర బలగాల కు అవసరమైన వసతులు కల్పించుట పై సమీక్షించారు.
ఈ సమీక్షలో జిల్లా అదనపు ఎస్పీ కె. గుణ శేఖర్ , ITBP కమాండెంట్ ఎస్. పి. జోషీ , డిప్యూటీ కమాండెంట్ బి. ఎస్. రెడ్డి, డి ఎస్పీ సత్యనారాయణ, సాయుధ దళ డి. ఎస్పీ నరేందర్ రావు, అసిస్టెంట్ కమాండెంట్ వినోద్ కుమార్ లు పాల్గొన్నారు.