నేవీ సన్నాహక విన్యాసాల్లో తప్పిన ప్రమాదం
విశాఖపట్నం : ఏపీలో విశాఖ తీరంలో జరిగిన నేవీ సన్నాహక విన్యాసాల్లో ప్రమాదం తప్పింది. రేపు జరగనున్న నౌకాదళ వేడుకల సందర్భంగా నిన్న పూర్తిస్థాయి సన్నాహక విన్యాసాలు నిర్వహించారు. విమానాల నుంచి రెండు ప్యారాచూట్ల ద్వారా నావికులు దిగుతుండగా గాలి అనుకూలించక పోవడంతో ఒకదానికొకటి చిక్కుకున్నాయి దీంతో ఇద్దరు నావికులు సముద్రంలో పడిపోయారు. అప్పటికే సముద్రంలో ఉన్న జెమినీ బోట్ల సిబ్బంది వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు.